సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కలది గలట్టే
టైటిల్: కలది గలట్టే
పల్లవి:
ప|| కాకున్న సంసారగతులేల | లోకకంటకములగు లోభములేల ||
చరణం:చ|| వినికిగనవలసినను విష్ణుకీర్తన చెవికి | వినికిచేసిన నదియె వేదాంతబోధ ||
మనికిగనవలసినను మధువైరిపై భక్తి | వునికి ప్రాణులకు బ్రహ్మోపదేశంబు ||
చ|| చదువు గనవలసినను శౌరినామము దిరుగ | జదువుటే సకలశాస్త్రముల సమ్మతము |
నిదుర గనవలసినను నీరజాక్షునికి దన- | హృదయమర్పణ సేయుటిది యోగనిదుర ||
చ|| ఆస వలసిన వేంకటేశ్వరునికృపకు- | నాససేయుటే పరమానందసుఖము |
వాసి గనవలసినను వైష్ణవాగారంబు | వాసి సేయుట తనకు వైభవస్ఫురణ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం