సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కలిగెనిది మాకు
టైటిల్: కలిగెనిది మాకు
పల్లవి:
ప|| కలిగెనిది మాకు కైవల్యం | కలకలాము హరికథా శ్రవణం ||
చరణం:చ|| ఆచింత్య మద్భుత మానందం | ప్రచురం దివ్యం పావనం |
సుచరిత్రం శ్రుతిశోభితం | అచలం బిదివో హరికీర్తనం ||
చ|| నిరతం నిత్యం నిఖిల శుభకరం | దురితహరం భవదూరం |
పరమమంగళం భావాతీతం | కరివరదం నిజకైంకర్యం ||
చ|| సులభం సుకరం శోకనాశనం | ఫలదం లలితం భవహరణం |
కలితం శ్రీవేంకటేశ శరణం | జలజోదర నిత్యస్తోత్రం ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం