సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కలిగినది యొక్కటే
టైటిల్: కలిగినది యొక్కటే
పల్లవి:
ప|| కలిగినది యొక్కటే కమలాపతిసేవ | తెలుప కొంగిచ్చేను దిబ్బెము దొడికేను ||
చరణం:చ|| హరియే పరతత్త్వ మతడొక్కడే గతి | ధరలోన దేవతలెందరైనా గలుగనీ |
మురహరనామము ముంచి యొక్కటే యెక్కుడు | యిరవైన మంత్రము లెన్నియైనా నుండనీ ||
చ|| గోవిందుదాసులే పెక్కువఘను లిందరిలో | వేవేలు పెద్దలటు వేలసంఖ్య లుండనీ |
కైవసపు విష్ణు కైంకర్యమే సాధనము | యీవలనావల పుణ్యమెంతైన గలుగనీ ||
చ|| పట్టిన శ్రీవేంకటేశు భక్తియొక్కటే ఘనము | యిట్టే శాస్త్రజ్ఞాన మెట్లున్నను |
వొట్టినయాతని ముద్రలొక్కటికి మూలము | యెట్టి లాంఛనములిల నెన్నియైనా నుండనీ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం