సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కలిగినమతి
టైటిల్: కలిగినమతి
పల్లవి:
ప|| కలిగినమతి వృధాగాకుండా | అలరుటె పుణ్యంబగు ఫలము ||
చరణం:చ|| ఒనరిన ఈ భవ ముసు రనకుండ | ఘనుడే జీవుడు గల ఫలము |
తనువుమోచి చైతన్యాత్ముని మతి | గనుటే వివేకముగల మతి ||
చ|| చేసిన పుణ్యము చెడిపోకుండ | శ్రీ సంపద మెరసిన ఫలము |
ఈసుల రేసుల యితర దూషణల | బాసుటె అపురూపపు ఫలము ||
చ|| హరి గొలిచియు మిథ్యగాకుండ | విరసముడిచి చదివిన ఫలము |
తిరువేంకటగిరి దేవుని సరిగా | పరుల గొలవనిదె బహుఫలము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం