సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కలియుగ మెటులైనా
టైటిల్: కలియుగ మెటులైనా
పల్లవి:
ప|| కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||
చరణం:చ|| పాప మెంత గలిగిన బరిహరించేయందుకు | నాపాల గలదుగా నీనామము |
కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు | చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు ||
చ|| ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను | సరి గావగద్దుగా నీశరణాగతి |
గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ | నిరతి గలదుగా నీభక్తి నాకు ||
చ|| హితమైనయిహపరా లిష్టమైనవెల్లా నియ్య | సతమై కలదుగా నీసంకీర్తన- |
తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ | గతి గలదుగా నీకమలాదేవి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం