సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కల్లగాదు నీవు
టైటిల్: కల్లగాదు నీవు
పల్లవి:
ప|| కల్లగాదు నీవు మాకు గలిగితే జాలు | తొల్లిటి నీవు యింకా దోడుక వచ్చేను ||
చరణం:చ|| తగిలి నీ వెదుటను తలవంచకుండగాను | నగితేను మొగమెత్తి నన్ను జూచేవు |
మగువ నెవ్వతె నీవు మనసున దలచేవో | బెగడ కానతీవయ్య పిలిచి తెచ్చేను ||
చ|| యెక్కడికో నీ విప్పుడెదురులు చూడగాను | మొక్కితే వేడుకొని నాచెక్కు నొక్కేవు |
అక్కడ నెవ్వతె మీది ఆస నీకు నున్నదో | తక్క కానతీవయ్య దండకు దెచ్చేను ||
చ|| యెందుకో నీపాయము మీదెత్తుకొని వుండగాను | అంది నిన్నుగూడితే నన్నాదరించేవు |
ముందు శ్రీ వేంకటేశ నీ మోహమెందు నుండునో | యిందే ఆనతీవయ్యా యింటికి దెచ్చేను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం