సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కలశా పురముకాడ
పల్లవి:

కలశా పురముకాడ కందువ చేసుకోని
అలరుచున్నవాడు హనుమంతరాయడు

చరణం:

సహజానన ఒక జంగచాచి సముద్రము దాటి
మహిమ మీరిగ హనుమంతరాయడు
ఇహమున రాము బంటై ఇప్పుడు నున్నవాడు
అహరహమును దొడ్డ హనుమంతరాయడు

చరణం:

నిండు నిధానపు లంక నిమిషాన నీరుసేసె
మండిత మూరితి హనుమంతరాయడు
దండితో మగిడి వచ్చి తగ సీత శిరోమణి
అండ రఘుపతి కిచ్చె హనుమంతరాయడు

చరణం:

వదలని ప్రతాపాన వాయుదేవు సుతుడై
మదియించి నాడు హనుమంతరాయడు
చెదరక యేప్రొద్దు శ్రీవేంకటేశు వాకిట
అదివో కాచుకున్నాడు హనుమంతరాయడు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం