సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కంబమున వెడలి
పల్లవి:

కంబమున వెడలి ఘన నరసింహము
కుంభిని హిరణ్యు గూలిచెను ||

చరణం:

తొడికి దైత్యు తన తొడపైకి దిగిచి
కడుపు చించి రక్తము చల్లి
జడియక పేగులు జందెంబులుగా
మెడ దగిలించుక మెరసీ వాడె ||

చరణం:

పెదవులు చింపుచు పెనుగోళ్ళ నదిమి
వుదుటుబునుక కొరి కుమియుచును
సదరపు గుండెలు చప్పరించుచును
మెదడు గుండముగ మెత్తీవాడే ||

చరణం:

దేవతల భయము దీర్చి అంకమున
శ్రీవనితను కృపసేయుచును
పావనపు టహోబల గిరిదైవము
శ్రీవేంకటగిరి చెలగీ వాడే ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం