సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కంచూగాదు పెంచూగాదు కడుబెలుచు మనసు
టైటిల్: కంచూగాదు పెంచూగాదు కడుబెలుచు మనసు
పల్లవి:
కంచూగాదు పెంచూగాదు కడుబెలుచు మనసు
యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు
పట్ట బసలేదు చూడ బయలుగా దీమనసు
నెట్టన బారుచునుండు నీరూగా డీమనసు
చుట్టి చుట్టి పాయకుండు జుట్టమూగా దీమనసు
యెట్టనెదుటనే వుండు నేటిదో యీమనసు
రుచు లెల్లా గానుపించు రూపు లేదు మనసు
పచరించు నాసలెల్లా బసిడిగా దీమనసు
యెచటా గరగదు రాయీగాదు మనసు
యిచటా నచటా దానే యేటిదో యీమనసు
తప్పక నాలో నుండు దైవము గాదు మనసు
కప్పి మూటగరాట్టదు గాలీ గాదు మనసు
చెప్పరానిమహిమల శ్రీవేంకటేశు దలచి
యిప్పు డిన్నిటా గెలిచె నేటిదో యీమనసు
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం