సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కనినవాడా గాను
టైటిల్: కనినవాడా గాను
పల్లవి:
ప|| కనినవాడా గాను కాననివాడా గాను | పొనిగి వొరులకై తే బోధించే నేను ||
చరణం:చ|| ధరణి గర్మము గొంత తగినజ్ఞానము గొంత | సరికి సరే కాని నిశ్చయము లేదు |
వొరిమె యెంచిచూచితే నొకటివాడా గాను | సరవి దెలియ కేమో చదివేము నేము ||
చ|| యీతల నిహము గొంత యింతలో బరము గొంత | చేతులు రెండు చాచే చిక్కుట లేదు |
యీతెరవులో నొకటి నేరుపరుచుకోలేను | కాతరాన కతలెల్లా గఱచితి నేను ||
చ|| దైవిక మొకకొంత తగుమానుషము గొంత | చేవలుచిగురువలె జేసేను |
యీవల శ్రీవేంకటేశు డిది చూచి నన్ను గాచె | భావించలేక యిన్నాళ్ళు భ్రమసితి నేను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం