సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కన్నవిన్న వారెల్ల
టైటిల్: కన్నవిన్న వారెల్ల
పల్లవి:
ప|| కన్నవిన్న వారెల్ల కాకు సేయరా | ఉన్నతుడ వైన నీకీ వొచ్చములేల నయ్య ||
చరణం:చ|| దేవతల గాచినట్టి దేవుడ నీకు పసుల | నీవల గాచితివనే హీనమేల |
కావించి పాలజలధి కాపురముండినట్టి | నీవు పాల దొంగవవనే నింద నీకు ఏల ||
చ|| కాలమందు బలి దైత్యు గట్టివేసినట్టి నీకు | రోలకట్టు వడినట్టి రోత నీకేల |
పోలించి లోకాల కెల్ల పొడవైన దేవుడవు | బాలుడవు రేపల్లెలో పారాడె నేలనయ్యా ||
చ|| పాము మీద పవ్వళించి పాయకుండి నట్టి నీకు | పాము తల తొక్కినట్టి పగ లేలా |
కామించి శ్రీ వేంకటాద్రి కడపరాయడ | భూమి మాయ లణచి నేర్పుల మాయ లేలయ్యా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం