సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కంటి శుక్రవారముె
పల్లవి:

కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ||

చరణం:

సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు కన్నీరు
చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి
తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని ||

చరణం:

పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడనందరి కనులకింపై
నిచ్చమల్లె పూవువలె నిటుతానుండే స్వామిని ||

చరణం:

తట్టుపునుగే కూరిచిచట్టలు చేరిచినిప్పు
పట్టి కరిగించు వెండి పళ్యాలనించి
దట్టముగ మేను నిండపట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండేబిత్తరి స్వామిని ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం