సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కనుగొనగ జీవు
టైటిల్: కనుగొనగ జీవు
పల్లవి:
ప|| కనుగొనగ జీవు డెరుగడుగాక యెరిగినను | అనవరతవిభవంబు లప్పుడే రావా ||
చరణం:చ|| విసుగ కెవ్వరినైన వేడనోర్చిననోరు | దెసలకును బలుమారు దెరచునోరు |
వసుధాకళత్రు దడవదుగాక తడవినను | యెసగ గోరికలు తనకిప్పుడే రావా ||
చ|| ముదమంది యెవ్వరికి మ్రొక్కనేర్చినచేయి | పొదిగి యధముల నడుగబూనుచేయి |
అదన హరి బూజసేయదుగాక సేసినను | యెదురెదుర గోరికలు యిప్పుడే రావా ||
చ|| తడయకేమిటికైన దమకమందెడిమనసు | అడరి యేమిటికైన నలయుమనసు |
వడి వేంకటేశు గొలువదుగాక కొలిచినను | బడిబడినె చెడనిసంపద లిట్లు రావా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం