సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కొలని దోపరికి
పల్లవి:

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు
కుల స్వామికిని గొబ్బిళ్ళో ||

చరణం:

కొండ గొడుగుగా గోవుల గాచిన
కొండొక శిశువునకు గొబ్బిళ్ళో
దండగంపు దైత్యుల కెల్లను తల
గుండు గండనికి గొబ్బిళ్ళో ||

చరణం:

పాప విధుల శిశుపాలుని తిట్టుల
కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన
గోప బాలునికి గొబ్బిళ్ళో ||

చరణం:

దండివైరులను తరిమిన దనుజుల
గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం