సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: కొలువరో మొక్కరో
పల్లవి:

కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ |
సులభు డిన్నిటాను వీడె సుగ్రీవ నరహరి ||

చరణం:

కంబములోన పుట్టి కనకదైత్యుని కొట్టి |
అంబరపు దేవతలకు అభయమిచ్చి |
పంబి సిరిదన తొడపై బెట్టుక మాటలాడి |
అంబుజాక్షుడైనట్టి ఆదిమ నరహరి ||

చరణం:

నానా భూషణములు ఉన్నతి తోడ నిడుకొని |
పూనికతో ప్రహ్లాదుని బుజ్జగించి |
మానవులకెల్లను మన్నన చాలా నొసగి |
ఆనందముతో నున్నాడు అదిగో నరహరి ||

చరణం:

మిక్కిలి ప్రతాపముతో మించిన కాంతులతోడ |
అక్కజపు మహిమల నలరుచును |
తక్కక శ్రీవేంకటాద్రి తావుకొని వరాలిచ్చీ |
చక్కదనములకెల్లా చక్కని నరహరి ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం