సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కొలువుడీ భక్తి
పల్లవి:

కొలువుడీ భక్తి కొండలకోనేటి-
నిలయుని శ్రీనిధి యైనవాని ||

చరణం:

ఆదిదేవుని నభవుని సామ-
వేదనాద వినోదుని నెర-
వాది జితప్రియు నిర్మలతత్త్వ-
వాదులజీవనమైన వాని ||

చరణం:

దేవదేవుడైన దివ్యుని సర్వ-
భావాతీత స్వభావుని
శ్రీవేంకటగిరి దేవుడైన పర-
దేవుని భూదేవతత్పరుని ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం