సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కొంచెమును ఘనము
టైటిల్: కొంచెమును ఘనము
పల్లవి:
ప|| కొంచెమును ఘనము గనుగొననేల హరిదలచు- | పంచమహాపాతకుడే బ్రాహ్మణోత్తముడు ||
చరణం:చ|| వేదములు చదివియును విముఖుడై హరికథల- | నాదరించని సోమయాజికంటె |
యేదియునులెని కులహీనుడైనను విష్ణు- | పాదసేవకుడువో బ్రాహ్మణోత్తముడు ||
చ|| పరమమగు వేదాంతపఠన దొరకియు సదా | హరిదలచలేని సన్న్యాసికంటె |
మరిగి పసురముదినెడిమాలయైనను వాడె | పరమాత్ము గొలిచినను బ్రాహ్మణోత్తముడు ||
చ|| వినియు జదివియు రమావిభుని దలపక వృథా | తనువు వేపుచు దిరుగుతపసికంటె |
చనువుగల వేంకటెశ్వరుదాసులకు వెంట | బనిదిరుగునధముడే బ్రాహ్మణోత్తముడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం