సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కొందరి కివి
టైటిల్: కొందరి కివి
పల్లవి:
ప|| కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు | యిందరిలోపల నీవెడమాయలు యేగతి దెలిసే నేనయ్యా ||
చరణం:చ|| దూరము కర్మమునకు జ్ఞానము: తోడునే వొండొకటికిని | దూరము: పరమునకు బ్రపంచము తొలుత విరుద్ధంబు: |
దూరము విరతికి సంసారము: తుదమొదలే లేదు : | యీరీతుల నీ వెడమాయలు యేగతి దెలిసెద నేనయ్యా ||
చ|| కూడదు దేహమునకు నాత్మకు గోత్రవిరోధం: బెన్నడును | కూడదు కోపమునకు శాంతము గుణావగుణములను: |
కూడదు బంధమునకు మోక్షము కోరికలే కట్లుగాన: | యేడ గొలదిగా శ్రీహరిమాయలు యేగతి దెలిసెద నేనయ్యా ||
చ|| శ్రీవేంకటపతి నన్నీగతి జిక్కించితి నీజగమునను: | భావింపగాను నీమహిమ బహుముఖములయర్థముగాన: |
యేవిధమును నేటికి నాకిక యెందెందని తగిలెద నేను | దైవికమగు నీదాసానుదాస్యము దక్కినదే నాకు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం