సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కొనరో కొనరో
టైటిల్: కొనరో కొనరో
పల్లవి:
ప|| కొనరో కొనరో మీరు కూరిమి మందు | వునికి మనికి కెల్ల నొక్కటే మందు ||
చరణం:చ|| ధృవుడు గొనినమందు తొల్లియు బ్రహ్లాదుడు | చవిగా గొనినమందు చల్లని మందు |
భవరోగములు వీడి పారగ బెద్దలు మున్ను | జవకట్టికొనిన నిచ్చలమైన మందు ||
చ|| నిలిచి నారదుండు గొనినమందు జనకుండు | గెలుపుతో గొని బ్రదికిన యామందు |
మొలచి నాలుగుయుగముల రాజులు ఘనులు | కలకాలము గొని కడగన్నమందు ||
చ|| అజునకు బరమాయువై యొసగినమందు | నిజమై లోకములెల్ల నిండినమందు |
త్రిజగములు నెరుగ తిరువేంకటాద్రిపై | ధ్వజ మెత్తె గోనేటిదరి నున్నమందు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం