సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కోరు వంచరో
టైటిల్: కోరు వంచరో
పల్లవి:
ప|| కోరు వంచరో కొటారు | అరసి మనసా అంతరాత్మకు ||
చరణం:చ|| కొండలపొడవులు కోరికకుప్పలు | పండినపంటలు భవములివి |
నిండినరాసులు నిజకర్మంబులు | అండనె యివె మాయారంభములు ||
చ|| వెలిధాన్యంబులు విషయపు రాసులు | పొలివారేటి వూరుపుగములు |
కలుషపుమదమున కావుగప్పినవి | అలవిమీర మాయారంభములు ||
చ|| బడి నింద్రియములబంతులు నురిపి | కడురతుల దండగట్టలతో |
యెడనెడ శ్రీవేంకటేశు మహిమలవే | అడియాలపు మాయారంభములు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం