సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కోటి మన్మథాకార
టైటిల్: కోటి మన్మథాకార
పల్లవి:
ప|| కోటి మన్మథాకార గోవింద కృష్ణ | పాటించి నీమహిమలే పరబ్రహ్మము ||
చరణం:చ|| ఆకాశమువంటిమేన నమరేమూర్తివిగాన | ఆకాశనదియే నీకు నభిషేకము |
మేకొని నీవే నిండుమేఘవర్ణుడవుగాన | నీకు మేఘపు పుష్పాలే పన్నీరుకాపు ||
చ|| చంద్రుడు నీమనసులో జనించె నటుగాన | చంద్రికలు కప్రకాపై సరి నిండెను |
ఇంద్రనీలపుగనుల యిలధరుడవుగాన | తంద్రలేని యీపెచూపే తట్టుపునుగాయను ||
చ|| లక్ష్మీపతిగాన లాగుల నీవురముపై | లక్ష్మి యలమేలుమంగే లలి నీతాళి |
సూక్ష్మమై శ్రీవేంకటేశ చుక్కలపొడవు గాగ | పక్ష్మనక్షత్రములే యాభరణహారములు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం