సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కటకటా దేహంబు
టైటిల్: కటకటా దేహంబు
పల్లవి:
ప|| కటకటా దేహంబు గాసిబెట్టగవలసె | నిటువంటిదెసలచే నిట్లుండవలసె ||
చరణం:చ|| చంపనొల్లకకదా సంసారమనియెడి- | గంపమోపు గడించె కర్మసంగ్రహము |
లంపటము విరియించ లావుచాలక తుదిని | దింప నొకకొంతైన తెగుదెంపులేదు ||
చ|| మనుపనోపకకదా మాయావిలంబమున | కనుమూసి కాంక్ష మరి కట్టె దైవంబు |
దినభోగములు విడువ దెరగేమిటను లేక | తనివిబొందించ నెంతయు వసముగాదు ||
చ|| తెలుపనోపకదా తిరువేంకటేశ్వరుడు | వెలలేనివేదనల వేచె బ్రాణులను |
బలిమి నజ్ఞానంబు బాయలే కితనినే | తలచి భవబంధముల దాటంగరాదు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం