సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కటకటా యిటుచేసె
పల్లవి:

కటకటా యిటుచేసె గర్మబాధ
యెటువంటివారికిని నెడయదీబాధ ||

చరణం:

దినదినము బ్రాణులకు దీపనముచే బాధ
తనుపోషణములు కందర్పబాధ
మనసుశాంతికి సదా మమకారములబాధ
తవివోనికోర్కులకు దైవగతిబాధ ||

చరణం:

వెడయాసచూపులకు వేడుకలచే బాధ
కడువేడ్కలకు వియోగములబాధ
తొడవైనయెఱుకలకు దురితబుద్ధులబాధ
జడియుబరచింతలకు సంసారబాధ ||

చరణం:

అరిది నిశ్చయమతికి ననుమానములబాధ
సరిలేనిజీవులకు జన్మబాధ
తిరువేంకటాచలాధిపుని గని మని కొలుచు-
వెరవుచేతనె కాని వీడదీబాధ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం