సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కట్టెదుర వైకుంఠము
టైటిల్: కట్టెదుర వైకుంఠము
పల్లవి:
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమలకొండ ||
వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ
శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ ||
సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ
పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ ||
వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతుసోబనపు గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీవేంకటపు గొండ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం