సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కూడు వండుట
టైటిల్: కూడు వండుట
పల్లవి:
ప|| కూడు వండుట గంజికొరకా తనకు | వేడుకలు గల సుఖము వెదుకుటకు గాక ||
చరణం:చ|| కుప్ప నురుచుట కసవుకొరకా తనువు | గొప్పయవుటిది మదము కొరక |
ఒప్పయిన వేడుకల నొరసి మనసు | నెప్పునకు రాదివియ నేరవలె గాక ||
చ|| కొలుచు దంచుట పొట్టకొరకా తా- | గులజుడై మూఢుండౌ కొరకా |
తలపోసి యిన్నిట దగిలి మీదు | తెలిసి సుఖదుఃఖముల దెలియవలెగాక ||
చ|| కొండ దవ్వుట యెలుకకొరకా తా- | గొండ యెక్కుట దిగుట కొరకా |
కొండల కోనేటిపతి గొలిచి తనకు | నిండి నాపదలెల్ల నీగవలె గాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం