సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కూడులేక
టైటిల్: కూడులేక
పల్లవి:
ప|| కూడులేక యాకటికి గూర దిన్నట్లు | ఆడనీడ మోవిచిగురాకు దినేరయ్య ||
చరణం:చ|| దుండపుబగవాడు దోచగానే తమకాన | కొండలెక్కినట్లు సిగ్గు గొల్లబోగాను |
దుండువెళ్ళేమదనునిదాడికి సతులచన్ను- | గొండలెక్కి సారెసారె గోడనేరయ్య ||
చ|| పొదిగొన్నయలపుతో బొదలుతీగెలక్రింద | తుదలేనిభయముతో దూరినట్లు |
మృదువైనతరుణుల మెఱగుబాహులతల- | పొదలెల్ల దూరితూరి వుంగడయ్యేరయ్య ||
చ|| వలసగంపలమోపువలె లంపటము మోచి | తలకుచు బారలేక దాగినయట్లు |
యిల వేంకటేశ నిన్నెఱగ కింద్రియముల | తలవరులిండ్లనే దాగేరయ్య ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం