సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: లాలనుచు నూచెరు
పల్లవి:

లాలనుచు నూచేరు లలనలిరుగడల |
బాలగండవీర గోపాలబాల || -- (నీలాంబరి)

చరణం:

ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ
పదరి కంకణరవము బహుగతులమ్రోగ
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ
ముదురు చెమటల నళికములు తొప్పదోగ || -- (మోహన)

చరణం:

సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక
మలయు రవళులకు బహుమారును బెళంక
కొలది కోవిగములు క్రోలుమదనాంక-
ములగ్రేణిసేయు రవములు వడిదలంక || -- (హుస్సేని)

చరణం:

సరుస పదములు జంగ చాపుచే బాయ
గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ
కరమూలముల కాంతి కడుజాయజేయు
సరస నురుకుసుమ వాసన లెదురుడాయ || -- (సారంగ)

చరణం:

కొలది నునుమేనుల కూనలసి యాడ
మెలకువతో నొకరొకరి మెచ్చి సరిగూడ
తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ
అలరి యెల్లరు మోహనా కృతులు చూడ || -- (కాపీ)

చరణం:

లలిత తాంబూల రసకలితంబులైన
తళుకు దంతములు కెంపుల గుంపులీన
మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన
చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన || -- (లలిత)

చరణం:

మలయ మారుత గతులు మాటికి జెలంగ
పలుకు గపురపు తావి పైపై మెలంగ
పలుగాన లహరి యింపుల రాల్గరగంగా
బలసి వినువారి చెవి బడలిక దొలంగ || -- (మధ్యమావతి)

చరణం:

లలనా జనాపాంగ రలిత సుమచాప
జలజలోచన దేవ సద్గుణ కలాప
తలపు లోపల మెలగు తత్త్వప్రదీప
భళిర గండపరేశ పరమాత్మరూప || -- (సురటి)

అర్థాలు



వివరణ