సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: లేదు బ్రహ్మవిద్యా
టైటిల్: లేదు బ్రహ్మవిద్యా
పల్లవి:
ప|| లేదు బ్రహ్మవిద్యామహాసుఖము తమ- | కీడు తమకర్మ మేమిసేయగవచ్చు ||
చరణం:చ|| నానావిధుల బొరలి నరుడు దానై వివిధ- | మైనకర్మములే అనుభవించి |
లేనిలంపటములకు లోనై దురితా- | ధీనులై క్రమ్మర దిరిగిపోవుటేకాని ||
చ|| పరగ నిన్నిట బొడమి బ్రాహ్మణుడై | సరిలేని వేదశాస్త్రములు చదివి |
అరుదయినకాంక్షచే నతిపాపపరులై | వెరవున బొడవెక్కి విరుగబడుటేకాని ||
చ|| చేరనిపదార్థములే చేరగోరుటగాని | చేరువనే యామేలు సిద్ధింపదు |
ధీరులై తమలోన దిరువేంకటేశ్వరుని | గోరి యిటు భజియింపగూడు టెన్నడుగాన ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం