సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: లలిత లావణ్య
టైటిల్: లలిత లావణ్య
పల్లవి:
లలిత లావణ్య విలానముతోడ | నెలత ధన్యతగతిగె నేటితోడ ||లలిత||
చరణం:కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ| తొప్పదోగేటి చెమతతోడ|
అప్పుడటు శశిరేఖలైన చనుగవతోడ| దప్పిదేరేటి మొముదమ్మితోడ ||లలిత ||
కులుకుగబరీభరము కుంతలంబులతోడ | తొలగదోయని ప్రేమతోడ|
మొలకనవ్వులు దొలకుముద్దు జూపులతోడ| పులకలు పొడవైన పొలుపుతోడ || లలిత ||
తిరువేంకటాచలాధిపుని మన్ననతోడ | సరిలేని దివ్యవాసనలతోడ|
పతికించరాని అరవిరిభావముతోడ| సిరిదొలంకెడి చిన్ని సిగ్గుతోడ || లలిత ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం