సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: లంకెలూడుటే
టైటిల్: లంకెలూడుటే
పల్లవి:
ప|| లంకెలూడుటే లాభము యీ- | కింకరులను నలగెడికంటెను ||
చరణం:చ|| జంపుల జంపక సరగునబాసేటి- | లంపటమేపో లాభము |
కంపుమోపుతో గనలి శరీరపు- | కొంపలోనవేగుటకంటెను ||
చ|| ఈవలనావల నేనేటియాసల- | లావు దిగుటేపో లాభము |
యేవగింతలకు నిరవగు నరకపు- | కోవులబడి మునుగుటకంటెను ||
చ|| తివిరి వేంకటాధిపుదాసులకృప- | లవలేశమెపో లాభము |
చవులని నోరికి సకలము దినితిని | భవకూపంబుల బడుటకంటెను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం