సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మాధవా భూధవా
టైటిల్: మాధవా భూధవా
పల్లవి:
ప|| మాధవా భూధవా మదన జనక | సాధు రక్షణ చతుర శరణు శరణు ||
చరణం:చ|| నారాయణాచ్యుతానంత గోవింద శ్రీ | నారసింహా కృష్ణ నాగశయన |
వారాహ వామన వాసుదేవ మురారి | శౌరీ జయజయతు శరణు శరణు ||
చ|| పుండరీకేక్షణ భువన పూర్ణగుణ | అండజగమన నిత్యహరి ముకుంద |
పండరి రమణ రామ బలరామ పరమ పురుష | చండభార్గవ రామ శరణు శరణు ||
చ|| దేవదేవోత్తమ దివ్యావతార నిజ | భావ భావనాతీత పద్మనాభ |
శ్రీవేంకటాచల శృంగారమూర్తి నవ | సావయవ సారూప్య శరణు శరణు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం