సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మాకెల్ల
టైటిల్: మాకెల్ల
పల్లవి:
ప|| మాకెల్ల "రాజనుమతో ధర్మ" యిది నీ- | యీకడ గలుగుటకేమరుదు ||
చరణం:చ|| అలగరుడగమన మహిశయనంబును | కలిసి నీయందె కలిగెనటా |
పొలసినపాపము బుణ్యము నరులకు | యెలమి గలుగుటకు నేమరుదు ||
చ|| యిదె నీడకన్ను యెండకన్ను మరి | కదిసి నీయందె కలిగెనట |
సదరపునరులకు జననమరణములు | యెదురనె కలుగుటకేమరుదు ||
చ|| శ్రీకాంత వొకదెస భుకాంత వొకదెస | కైకొని నీకిటు గలిగెనట |
యీకడ శ్రీవేంకటేశ యిహపరము | యేకమై మాకగుటేమరుదు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం