సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మాఱు మోవిదేటికి
టైటిల్: మాఱు మోవిదేటికి
పల్లవి:
ప|| మాఱు మోవిదేటికి మంకుదన మేటికి | జాఱువడ నే నవ్వితే సంతసించవలదా ||
చరణం:చ|| వడి నీకెమ్మోవి మీది వన్నెదీసినది చూచి | తొడరి వీడెమిచ్చితే దోసమాయిది |
కడుచెమటల నీపై గందవొడి చల్లితేను | జడియక నీవిందుకు సంతసించవలదా ||
చ|| కులికి నీకన్నులపై కుంకుమ వన్నెలుచూచి | బలిమి బన్నీరిచ్చితే పాపమాయిది |
కలసిన వేడి వేడి కాకలమే నటుచూచి | చలిగా నే విసరితే సంతసించవలదా ||
చ|| పిప్పియైన నీమేని పెక్కులాగులటు చూచి | ముప్పిరి గళలంటితే మోసమాయిది |
అప్పటి శ్రీ వేంకటేశ అలమితి విటునన్ను | చప్పుడు గాకియ్యకుంటే సంతసించవలదా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం