సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మాయపుదనుజుల
టైటిల్: మాయపుదనుజుల
పల్లవి:
ప|| మాయపుదనుజుల మదవైరి కపి- | రాయడు వీడివో రామునిబంటు ||
చరణం:చ|| పెట్టినజంగయు పెంపుమిగుల మొల | గట్టినకాసెయు గర్వమున |
నిట్టనిలిచి పూనినచేత నడిమి- | దిట్ట వీడువో దేవునిబంటు ||
చ|| నవ్వుచు లంకానగరపుదనుజుల- | కొవ్వణచిన కపికుంజరుడు |
మువ్వురువేల్పుల మొదలిభూతియగు- | రవ్వగు సీతారమణునిబంటు ||
చ|| పంకజసంభవుపట్టముగట్టగను | వుంకించిన తనవొడయనిచే |
పొంకపు కలశాపుర హనుమంతుడు | వేంకటరమణునివేడుకబంటు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం