సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మదమత్సరము
టైటిల్: మదమత్సరము
పల్లవి:
ప|| మదమత్సరము మనసుపేదైపో | పదరిన యాసలవాడవో వైష్ణవుడు ||
చరణం:చ|| ఇట్టునట్టు దిరిగాడి యేమైనా జెడనాడి | పెట్టరంటా బోయరంటా బెక్కులాడి |
యెట్టివారినైనా దూరి యెవ్వరినైన జేరి | వట్టియాసల బడనివాడువో వైష్ణవుడు ||
చ|| గడనకొరకు జిక్కి కాముకివిద్యల జొక్కి | నిడివి నేమైనా గని నిక్కి నిక్కి |
వొడలిగుణముతోడ వుదుట విద్యల జాల | వడదాకి బడలనివాడవో వైష్ణవుడు ||
చ|| ఆవల వొరుల జెడనాడగ వినివిని | చేవమీర యెవ్వరిని జెడనాడక |
కోవిదు శ్రీవేంకటేశు గొలిచి పెద్దలకృప | వానివర్తనల వాడువో వైష్ణవుడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం