సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మేదిని జీవుల
టైటిల్: మేదిని జీవుల
పల్లవి:
మేదిని జీవుల గావ మేలుకోవయ్యా
నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ||
తగుగోపికల కన్నుదామరలు వికసించె
మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా
తెగువ రాక్షసులనే తిమిరము విరియగ
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ||
ఘనదురితపు గలువలు వికసించె
మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా
పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ
జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా ||
వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ
మెరయుదోషరహిత మేలుకోవయ్యా
పొరసి నీవు నిత్యభోగములు భోగించ
నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా ||