సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మీదమీద వలపెక్కె
టైటిల్: మీదమీద వలపెక్కె
పల్లవి:
ప|| మీదమీద వలపెక్కె మేలు మేలోయి | చీదర రేచేవు నన్ను చెల్లు లేవోయి ||
చరణం:చ|| నిద్దురో నివ్వెరగో నేనేమో చెప్పగాను | వొద్దనుండే వూకొనవు వోయి మేలోయి |
పెద్దరికమో బీరమో బెట్టి వీడెమడిగితే | కద్దనవు లేదనవు గర్వమేలోయి ||
చ|| కాకలో వీకలో కడు నేను నవ్వినను | మాకువలె నున్నాడవు మతకమౌనోయి |
వేకమో వెరపూ వేగమే జేయి వేసితే | కేకరించి ములిగేవు గేలి యేలోయి ||
చ|| ఆసలో వాసులో అండ నేను నిలుచుంటే | మేనుల గాగలించేవు మెస్తిలేవోయి |
బాసతో శ్రీ వేంకటేశ పంతాన నన్ను గూడితి | వేసములెల్లా దీరె వింతలాయ నోయి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం