సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మీకుమీకునమరును
టైటిల్: మీకుమీకునమరును
పల్లవి:
మీకుమీకునమరును మిక్కిలివేడుకలెల్లా |
కైకొని నేమెల్లా చూడగంటిమిగదె ||
సింగారరాయడుగదే చిత్తజుగురుడుగదే |
అంగవించి నిన్ను పెండ్లాడినాడు |
బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు |
అంగన నీవు దేవులవైతివి గదే ||
కాంచనపు దట్టివాడు కౌస్తుభము మణివాడు |
మంచితనమున నీకు మగడుగదే వాడు |
మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు |
ఎంచగ నితని వురము ఎక్కితివిగదవే ||
చేతులు నాల్గింటివాడు శ్రీవేంకటేశ్వరుడు |
ఆతుమగా నిన్నునేలి అలరెగదేవాడు |
ఈతల శ్రీకాంతవు ఇన్నిటా నేరుపరివి |
ఈతని కెప్పుడు నీవు ఇరవైతివి గదే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం