సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మిక్కిలి మేలుది
టైటిల్: మిక్కిలి మేలుది
పల్లవి:
ప|| మిక్కిలి మేలుది అలమేలుమంగ | అక్కరతో నిన్నుజూచీ నలమేలుమంగ ||
చరణం:చ|| కొచ్చి కొచ్చి యాలాపించి కూరిమితో బాడగాను | మెచ్చీ నిన్నునిదె యలమేలుమంగ |
నెచ్చెలులతోడ నెల్లా నీగుణాలు సారె సారె | అచ్చలాన నాడుకొనీ నలమేలుమంగ ||
చ|| వాడల వాడల నీవు వయ్యాళి దోలగాను | మేడలెక్కి చూచీ నలమేలుమంగ |
వీడెము చేతబట్టుక వెస నీవు పిలువగా | ఆడనుండి వచ్చె నీకడ కలమేలుమంగ ||
చ|| ఈలీల శ్రీవేంకటేశ ఇంత చనవియ్యగాను | మేలములాడీ నలమేలుమంగ |
యేలిన నీ రతులను ఇదె తన నేరుపెల్లా | ఆలోచనలు సేసీ నలమేలుమంగా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం