సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మిక్కిలి విచ్చి
టైటిల్: మిక్కిలి విచ్చి
పల్లవి:
ప|| మిక్కిలి విచ్చి చెప్పితే మేడిపండు బోన మిది | తొక్కు మెట్టు సందడెల్ల తో దోపులే కావా ||
చరణం:చ|| చాయలకే మాటలాడి చనవులు మెఱసేవు | యీ యెడ దెలుసునే మీకిద్దరికిని |
నాయమే మడిగేవే నన్ను నీ వింతటి లోనే | మాయదారి సుద్దులెల్ల మఱగులే కావా ||
చ|| గిలిగింత నవ్వు నవ్వి కిందు మీదు జూచేవు | నిలువుల నున్నవే మీనేరుపు లెల్లా |
మలసి మీ సరితలు మాకేమి అప్పగించేరే | కొలది లేని వలపు గుమితమే కాదా ||
చ|| భావపు రతి గరగి పై జేయి వేసేవు | వావిరి దేటుపడె మీ పగలెల్లను |
శ్రీ వేంకటేశుడు నీవు సిగ్గు లిందేల పడేరే | కూవలై వున్నవి మీగుట్లింతే కావా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం