సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మిక్కిలిపుణ్యులు
పల్లవి:

మిక్కిలిపుణ్యులు హరి మీదాసులే హరి
తక్కినవారు మీకృపదప్పినవారు హరి ||

చరణం:

వున్నతపుసంపదల నోలలాడేయట్టివాడు
మున్నిటజన్మాన నీకు మొక్కినవాడు హరి
పన్ని పడనిపాట్ల బరులగొలిచేవాడు
వున్నతిమిము సేవించనొల్లనివాడు హరి ||

చరణం:

పూని దేవేంద్రాదులై పొడవుకెక్కినవారు
శ్రీనాథ మిమ్మునే పూజించినవారు హరి
నానారకముల నలగుచుండేవారు
నానాడే నీమహిమ నమ్మినవారు హరి ||

చరణం:

పావనులై నిజభక్తి బ్రపన్నులయ్యినవారు
శ్రీవేంకటేశ మిమ్ము జేరినవారె హరి
వేవేలుదేవతలవెంట దగిలేటివాడు
కావించి మిమ్మెరుగనికర్మి యాతడే హరి ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం