సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మలసీ జూడరో
టైటిల్: మలసీ జూడరో
పల్లవి:
ప|| మలసీ జూడరో మగసింహము | అలవి మీరిన మాయల సింహము ||
చరణం:చ|| అదివో చూడరో ఆదిమ పురుషుని | పెద యౌబళముమీది పెనుసింహము |
వెదికి బ్రహ్మాదులు వేదాంతతతులు | కదిసి కానగ లేని ఘనసింహము ||
చ|| మెచ్చి మెచ్చి చూడరో మితిమీరినయట్టి | చిచ్చరకంటితోడి జిగిసింహము |
తచ్చిన వారిధిలోని తరుణిగౌగిటజేర్చి | నచ్చిన గోళ్ళ శ్రీ నరసింహము ||
చ|| బింకమున జూడరో పిరితీయక నేడు | అంకపుదనుజ సంహార సింహము |
వేంకటనగముపై వేదాచలముపై | కింకలేక వడి బెరిగిన సింహము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం