సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మంచిదివో సంసారము
టైటిల్: మంచిదివో సంసారము
పల్లవి:
ప|| మంచిదివో సంసారము మదమత్సరములు మానిన | కంచును బెంచును నొకసరిగా దాచూచినను ||
చరణం:చ|| ఆపదలకు సంపదలకు నభిమానింపక యుండిన | పాపము బుణ్యము సంకల్పములని తెలిసినను |
కోపము శాంతము తమతమగుణాములుగా భావించిన | తాపము శైత్యమునకు దా దడబడకుండినను ||
చ|| వెలియును లోపలయును నొకవిధమై హృదయంబుండిన | పలుకునుబంతము దానొక భావన దోచి
తలపున దిరువేంకటగిరిదైవము నెలకొనియుండిన | సొలపక యిన్నిటికిని దా సోకోరుచెనైనా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం