సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మందరధర
టైటిల్: మందరధర
పల్లవి:
ప|| మందరధర మధుసూదన | నందగోపనందనా ||
చరణం:చ|| నరసింహ గోవింద నవనీతానంద | హరిముకుంద నయనారవింద |
కరివరద గరుడగమనరూప- | గురుచాపా యదుకులదీపా ||
చ|| భవదూర భయహర పరిపూర్ణామృత | భువనపాలన సురపాలన |
భువనభూషణ పరమపురుష పురాతన | నవభోగా కరుణాయోగా ||
చ|| పంకజాసననుత భవ్యనిర్మలపాద- | పంకజ పరమ పరాత్పర|
వేంకటశైలనివేశ శు- | భంకరా క్షేమంకరా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం