సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మందులేదు దీనికి
టైటిల్: మందులేదు దీనికి
పల్లవి:
ప|| మందులేదు దీనికి మంత్రమేమియు లేదు | మందు మంత్రము దనమతిలోనే కలదు ||
చరణం:చ|| కదలకుండగ దన్ను గట్టివేసిన గట్టు | వదలించుకొన గొంత వలదా |
వదలించబోయిన వడిగొని పైపైనే | కదియుగాని తన్ను వదలదేమియును ||
చ|| మనసులోపలనుండి మరి మీద దానుండి | యెనసినతిరువేంకటేశుని |
తనరినతలపున దలప దుష్కృతములు | తనకుదానే వీడు దలకవలదుగాన ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం