సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మనసుకు మనసె
టైటిల్: మనసుకు మనసె
పల్లవి:
ప|| మనసుకు మనసె మర్మముగాక | వినికివలె దనకు విన్నవించ గలనా ||
చరణం:చ|| తలుపులో తమకము తానె యెరగడట | యెలమిదన్ను గొసరె నేలె నాకూ |
కలిమి జంద్రుని రాక కలువ పువ్వులకును | తెలిపిరా యెవ్వరైన దినదినమునకు ||
చ|| తప్పక వరుసెరిగి తానె విచ్చేయడట | యిప్పుడు విలువనంప నేలె నాకూ |
వుప్పతిల్లు గోవిలకు నొగి వసంతకాలము | చెప్పుదురా యెవ్వరైన జెలగి యేటేటను ||
చ|| దగ్గరి వచ్చినవాడు తానె యెరుగు గాక | యెగ్గుసిగ్గులిటు దీర్చనేలె నాకు |
అగ్గమై శ్రీ వేంకటేశుడాదరించి నిన్నుగూడె | నిగ్గు నిలువుకు నీడ నేర్పిరా యితరులు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం