సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మనసున నెప్పుడు
టైటిల్: మనసున నెప్పుడు
పల్లవి:
ప|| మనసున నెప్పుడు మానదిది | దినబాధెటువలె దీరీనో ||
చరణం:చ|| చిత్త్తవికారము జీవులపాపము | తత్తరపరచక తడయదిది |
కత్తులబో నీకాయపువయసున- | నెత్తినమదమున కేదిగతో ||
చ|| అసలుగంబ మీయాశాదోషము | విసిగిన నూరక విడువదిది |
వసులమూట మోవగ బడవేయగ | వసము గాని దెటువలెనౌనో ||
చ|| పాముచెలిమి రంపపుసంసారము | గాములమోచినగంప యిది |
కామించుచు వేంకటపతి దలపక | యేమరి వుండిన నేమౌనో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం