సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మొదలుండ గొనలకు
టైటిల్: మొదలుండ గొనలకు
పల్లవి:
ప|| మొదలుండ గొనలకు మోచి నీళ్ళు వోయనేల | యెదలో నీవుండగా నితరము లేలా ||
చరణం:చ|| నిగమ మార్గముల నే నడచే నంటే | నిగము లెల్లను నీమహిమే |
జగము లోకుల జూచి జరిగెద నంటే | జగములు నీ మాయ జనకములు ||
చ|| మనసెల్ల నడ్డపెట్టి మట్టున నుండే నంటే | మనసు కోరికెలు నీ మతకాలు |
తనువు నింద్రియములు తగ గెలెచే నంటే | తనువు నింద్రియములు దైవము నీ మహిమా ||
చ|| ఇంతలోని పనికిగా యిందు నందు జొరనేల | చెంత నిండు చెరువుండ చెలమ లేలా |
పంతాన శ్రీవేంకటేశ పట్టి నీకే శరణంటి | సంత కూటాల ధర్మపు సంగతి నాకేలా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం