సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మోహము విడుచుటే
టైటిల్: మోహము విడుచుటే
పల్లవి:
ప|| మోహము విడుచుటే మోక్ష మది | దేహ మెరుగుటే తెలివీ నదే ||
చరణం:చ|| ననిచినతనజన్మము గర్మము దన- | పనియు నెరుగుటే పరమ మది |
తనకు విధినిషేధములు బుణ్యముల- | ఘనత యెరుగుటే కలిమి యది ||
చ|| తరిదరి బ్రేమపు తల్లిదండ్రులను | యెరుగనిదే కులహీన తది |
చరుల బొరలి యాచారధర్మములు | మరచినదే తనమలిన మది ||
చ|| కమ్మర గమ్మర గామభోగములు | నమ్మి తిరుగుటే నరక మది |
నెమ్మది వేంకటనిలయుని దాసుల- | సొమ్మయి నిలుచుట సుకృత మది ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం