సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మోహంపు రతిముదము
టైటిల్: మోహంపు రతిముదము
పల్లవి:
ప|| మోహంపు రతిముదము ముద్దుజూపుల మదము | దేహంపు సొబగెల్లదెలిపె సదమదము ||
చరణం:చ|| మించు మట్టెల గిలుకు మెరుగు గుబ్బల కులుకు | వంచు జూపుల చిలుకు వసివాడు బలుకు |
మంచుజెమటల తళుకు మనసు లోపలి యళుకు | అంచుటదరపు బెళుకు అలమేటి జళుకు ||
చ|| కరమూలములగరగు కదలు బయ్యెద చెరగు | సిరుల చెలువపు మొరగు చెక్కుపై మరగు |
గరిగరికె తతులెరుగు ఘాతలంటిన తెరగు | గరిమతో చెలియునికి కప్పురపుటరగు ||
చ|| కలికి తనము పోగు కమ్మదావుల వేగు | వలపు తమకముల పరవశము పెనుజాగు |
కలకంటి బాగు వేంకటపతి జెలరేగు | చెలియ సమరతుల మించిన వింతబాగు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం